ఎన్నో అవమానాలు ఉంటాయి.. నాలాంటి వాళ్లకు ఈ పదవి సరిపోదు: జేసీ ప్రభాకర్ రెడ్డి
- ఎమ్మెల్యే పదవి ముళ్ల కిరీటం వంటిది
- ఎన్నో విమర్శలు, అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది
- ప్రతి ఒక్కరూ మంచి పనులతో ప్రజల గుండెల్లో నిలవాలి
ప్రతి మనిషి సమాజం కోసం మంచి పనులు చేస్తూ ప్రజల గుండెల్లో స్థానం కల్పించుకోవాలని ప్రభాకర్ రెడ్డి సూచించారు. ఆ తపనతోనే తన జీవితమంతా ధారపోసి, ప్రజల కోసం పని చేస్తున్నానని చెప్పారు. 40 ఏళ్లుగా తాడిపత్రి ప్రజలు తమ కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారని... వారందరి గుండెను గుడిలా చూసుకుంటున్నానని అన్నారు.