prabhudeva: 'కృష్ణమనోహర్ ఐపీఎస్' గా ప్రభుదేవా .. టీజర్ రిలీజ్

  • ఐపీఎస్ ఆఫీసర్ గా ప్రభుదేవా
  •  నాయికగా నివేదా పేతురాజ్
  •  త్వరలో ప్రేక్షకుల ముందుకు

దర్శకుడిగా హిందీలో వరుస సినిమాలను తెరకెక్కించిన ప్రభుదేవా, ఆ తరువాత చెన్నైకి తిరిగి వచ్చేసి మళ్లీ నటనవైపు దృష్టి పెట్టాడు. అప్పుడప్పుడు నిర్మాణం వైపు దృష్టి పెడుతూనే నటుడిగా బిజీ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో తమిళంలో ఆయన చేసిన ఒక సినిమాను తెలుగులో 'కృష్ణమనోహర్ ఐపీఎస్' పేరుతో రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ప్రభుదేవా ఐపీఎస్ ఆఫీసర్ గా నటించిన ఈ సినిమాలో, ఆయన సరసన నివేదా పేతురాజ్ కనిపించనుంది. తాజాగా ఈ సినిమా నుంచి తెలుగు టీజర్ ను రిలీజ్ చేశారు. తనకి రైట్ అనిపించింది చేసుకుంటూ వెళ్లిపోయే ఐపీఎస్ ఆఫీసర్ గా ఈ టీజర్లో ప్రభుదేవా కనిపిస్తున్నాడు. ఆయన యాక్షన్ సీన్స్ పై కట్ చేసిన ఈ టీజర్ ఆకట్టుకునేలా వుంది. ముగిల్ చెల్లప్పన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఏ స్థాయిలో తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.

More Telugu News