Rivers: ఆ నదుల నీళ్లు మాకిచ్చినా ఇవ్వకపోయినా నష్టమేమీ లేదు: పాక్ మంత్రి ఖవాజా

  • ఈ విషయమై మాకు ఎటువంటి ఆందోళన లేదు
  • ఆ నీటిని అక్కడి ప్రజలకు ఇచ్చుకోవచ్చు
  • పశ్చిమ నదుల్లో నీటిని మళ్లిస్తే ఊరుకోం

రావి, బియాస్, సట్లెజ్ నదీ జలాలు పాకిస్థాన్ కు మళ్లకుండా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నిన్న వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై పాకిస్థాన్ నీటి వనరుల శాఖ కార్యదర్శి ఖవాజా షుమాయిల్ స్పందించారు.

తూర్పు నదులు బియాస్, రావి, సట్లెజ్ ల నీటిని తమకు ఇచ్చినా, ఇవ్వకపోయినా పెద్దగా నష్టమేమీ లేదని అన్నారు. ఈ నదుల జలాల విషయమై తమకు ఎటువంటి ఆందోళన లేదని, ఆ నీటిని అక్కడి ప్రజలకు ఇచ్చుకోవచ్చని, సింధూ నదీ జలాల ఒప్పందం కూడా అందుకు అనుమతిచ్చిందని మీడియాతో ఆయన అన్నారు. అయితే, తమకు హక్కులున్న పశ్చిమ నదులు సింధు, చీనాబ్, జీలం నదుల్లోని నీటిని మళ్లిస్తే మాత్రం తమ అభ్యంతరాలను లేవనెత్తుతామని ఖవాజా స్పష్టం చేశారు.  

More Telugu News