Amith Shah: స్కాముల్లో ప్రమేయం తప్ప కాంగ్రెస్, డీఎంకేలు ప్రజలకు చేసిందేమీ లేదు: అమిత్ షా

  • పొత్తుపై విమర్శలు గుప్పించిన అమిత్ షా
  • రూ.12 లక్షల కోట్ల మేర కుంభకోణం
  • బీజేపీకి సుపరిపాలనే లక్ష్యం

అవినీతికి మారుపేరు కాంగ్రెస్, డీఎంకేలని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా విమర్శించారు. నేడు ఆయన తమిళనాడులోని రామనాథపురంలో జరిగిన శక్తి ప్రముఖ్ సమ్మేళన్‌లో మాట్లాడుతూ కాంగ్రెస్, డీఎంకే పార్టీల మధ్య పొత్తుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆ రెండు పార్టీలు తమిళనాడు అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని విమర్శించారు.

అవినీతికి మారుపేరు ఈ రెండు పార్టీలని.. రూ.12 లక్షల కోట్ల మేరకు కుంభకోణం చేశాయని ఆరోపించారు. 2జీ, కోల్ స్కామ్, అగస్టా వెస్ట్ ల్యాండ్, ఆదర్శ్ స్కామ్ తదితర స్కాముల్లో ప్రమేయం తప్ప కాంగ్రెస్, డీఎంకే ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. తమిళనాడు ప్రజల కోసం రాహుల్ గాంధీ, స్టాలిన్ ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. బీజేపీ, ఎన్డీఏలు మాత్రం సుపరిపాలనే లక్ష్యంగా పని చేస్తున్నాయని అమిత్ షా చెప్పారు. 

More Telugu News