pavan: 'పంజా' సినిమాలో అవి ప్రధాన లోపంగా కనిపిస్తాయి: పరుచూరి గోపాలకృష్ణ

  • హీరో ప్రధానంగా కథ సాగకపోవడం
  •  కథనంలో అయోమయం
  • ఆడియన్స్ కి అర్థంకాకపోవడం

తాజాగా పరుచూరి గోపాలకృష్ణ .. 'పరుచూరి పాఠాలు' కార్యక్రమంలో, పవన్ కల్యాణ్ కథానాయకుడిగా చేసిన 'పంజా' సినిమాను గురించి ప్రస్తావించారు. "ఈ సినిమాలో కథానాయకుడు చిన్నప్పటి నుంచి భగవాన్ అనే విలన్ దగ్గర పెరుగుతాడు. మరో విలన్ అయిన కులకర్ణి నుంచి భగవాన్ ను కాపాడుతూ ఉంటాడు. ఇక అక్కడి నుంచి హీరోయిన్ ఊరికి వచ్చేసిన హీరో, అక్కడ ఆమె పాలిట విలన్ గా నిలిచిన సాంబశివుడిని ఎదుర్కొంటాడు.

అక్కడ ఇద్దరు విలన్ల మధ్య ఒకటిగా హీరో పాత్ర వుంది. ఇక్కడ హీరోయిన్ కి .. సాంబశివుడికి మధ్య ఒకటిగా హీరో పాత్ర కనిపిస్తుంది. కథ హీరో ప్రధానంగా నడవకపోవడం ఈ సినిమా ప్రధాన లోపంగా చెప్పుకోవచ్చు. ఇక సంతలో హీరోపై ఎటాక్ జరిగినప్పుడు ఆ రౌడీలు భగవాన్ తాలూకు వాళ్లో .. కులకర్ణి తాలూకు వాళ్లో అయ్యుంటారని ఆడియన్స్ అనుకుంటారు. కానీ వచ్చింది సాంబశివుడి మనుషులు. కథనం ఎప్పుడూ కూడా అర్థవంతంగా ఉండాలి .. అయోమయంగా వుండకూడదు. ఏం జరుగుతుందనేది ఆడియన్స్ కి అర్థం కాకపోవడం మరో లోపంగా కనిపిస్తుంది" అని చెప్పుకొచ్చారు. 

More Telugu News