Tollywood: రేపు మధ్యాహ్నం కోడి రామకృష్ణ అంత్యక్రియలు

  • ఫిలింనగర్ లోని నివాసానికి ఆయన భౌతికకాయం
  • జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు
  • గచ్చిబౌలిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ ఈరోజు మృతి చెందారు. హైదారాబాద్ లోని గచ్చిబౌలిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు విడిచారు. కోడి రామకృష్ణ భౌతికకాయాన్ని ఫిలింనగర్ లోని ఆయన నివాసానికి తరలించనున్నారు. రేపు మధ్యాహ్నం జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో కోడి రామకృష్ణ అంత్యక్రియలు నిర్వహించనుట్టు ఆయన బంధువులు తెలిపారు.

More Telugu News