balakrishna: హీరోగా మోక్షజ్ఞ ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ

  • మోక్షజ్ఞ కోసం కథలు వినలేదు 
  • మంచి కథ దొరికితే ప్రయత్నాలు
  • వచ్చే ఏడాది ఎంట్రీ ఇచ్చేస్తాడు  

నందమూరి అభిమానులంతా హీరోగా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాదిలోనే మోక్షజ్ఞ ఫస్టు సినిమా సెట్స్ పైకి వెళుతుందని అంతా భావించారు. కానీ ఈ విషయానికి సంబంధించిన సమాచారం ఇంతవరకూ బయటికి రాలేదు.

తాజా ఇంటర్వ్యూలో బాలకృష్ణకి ఇదే ప్రశ్న ఎదురైంది. హీరోగా మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు వుండనుందనే ప్రశ్నకి ఆయన స్పందిస్తూ .. "మోక్షజ్ఞ కోసం ఇంతవరకూ ఎలాంటి కథలను వినలేదు. మంచి కథ దొరికితే ఆ దిశగా ప్రయత్నాలు మొదలవుతాయి. వచ్చే ఏడాది మోక్షజ్ఞ హీరోగా తప్పకుండా ఓ సినిమా ఉంటుంది" అని చెప్పుకొచ్చారు. ఇక తన తదుపరి సినిమా బోయపాటి శ్రీనుతో ఉంటుందనీ, ఎన్నికల హడావిడి పూర్తయిన తరువాత సెట్స్ పైకి వెళతామని అన్నారు. 

More Telugu News