Anushka Shetty: ఓ క్రిమినల్ చరిత్ర గలిగిన నాయకుడు జగన్: మంత్రి యనమల

  • ఏపీలో టీడీపీని లేకుండా చేసే యత్నం
  • మోదీ నేతృత్వంలో కుట్రల కూటమి
  • ఈ కూటమిలో భాగస్వాములు టీఆర్ఎస్, జగన్
ఏపీలో టీడీపీని లేకుండా చేయాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, మోదీ నేతృత్వంలోని ఈ కుట్రల కూటమిలో భాగస్వాములు టీఆర్ఎస్, జగన్మోహన్ రెడ్డి అని ఆరోపించారు. ఓ క్రిమినల్ చరిత్ర గలిగిన, క్రిమినల్ కుటుంబం నుంచి వచ్చిన నాయకుడు జగన్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీని తాను ఒక్కడినే ఎదుర్కోలేనని భావించిన జగన్, టీఆర్ఎస్ తో చేతులు కలిపి మోదీ సహకారం తీసుకుంటున్నారని ఆరోపించారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు జగన్ అడ్డుపడుతున్నారని, అందుకు, మోదీ దోహదపడుతున్నారని అన్నారు.
Anushka Shetty
Telugudesam
Yanamala
YSRCP
jagan
TRS
kcr
modi
bjp

More Telugu News