varun tej: హరీశ్ శంకర్ 'వాల్మీకి' షూటింగ్ మొదలైపోయింది

  • హరీశ్ శంకర్ నుంచి 'వాల్మీకి'
  • సంగీత దర్శకుడిగా దేవిశ్రీ
  •  ఈ ఏడాది చివరిలో విడుదల  
మాస్ ఆడియన్స్ పల్స్  తెలిసిన దర్శకుడిగా హరీశ్ శంకర్ కి మంచి పేరుంది. 'దువ్వాడ జగన్నాథం' సినిమా తరువాత ఆయన ప్లాన్ చేసుకున్న ఒకటి రెండు ప్రాజెక్టులు పట్టాలెక్కలేదు. దాంతో ఆయనకి ఎక్కువ గ్యాప్ వచ్చేసింది. దాంతో తమిళంలో కొంతకాలం క్రితం ఘన విజయాన్ని అందుకున్న 'జిగర్తాండ' సినిమాను రీమేక్ చేయడానికి ఆయన రంగంలోకి దిగాడు.

ఈ రీమేక్ కి 'వాల్మీకి' అనే టైటిల్ ను ఖరారు చేసుకున్న ఆయన ఒక హీరోగా వరుణ్ తేజ్ ను ఎంపిక చేసుకున్నాడు. మరో హీరోగా అథర్వ మురళిని తీసుకునే అవకాశాలు వున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ ఈ రోజునే మొదలైంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై నిర్మితమవుతోన్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ ఏడాది చివరిలో ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో వున్నారు. ఇది తన కెరియర్లో ఓ డిఫరెంట్ మూవీ అవుతుందనే నమ్మకంతో వరుణ్ తేజ్ వున్నాడు.
varun tej
harish shankar

More Telugu News