Jammu And Kashmir: 155 మంది నాయకులకు భద్రత ఉపసంహరణ.. సంచలన నిర్ణయం తీసుకున్న జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్

  • వేర్పాటు వాదులకు కూడా భద్రత తొలగింపు
  • మాజీ ఐఏఎస్ షా ఫైజల్ భద్రత ఉపంసంహరణ
  • సత్యపాల్ నిర్ణయంతో తిరిగి వచ్చిన వెయ్యి మంది పోలీసులు, వంద వాహనాలు

జమ్ముకశ్మీర్ లెప్టినెంట్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని వివిధ పార్టీలకు చెందిన 155 మంది నాయకులకు భద్రతా సిబ్బందిని ఉపసంహరిస్తూ ఆదేశాలు జారీ చేశారు. రాజకీయ నాయకులకు భద్రత అవసరం లేదని ఆయన ఆదేశించారు. సత్యపాల్ నుంచి ఆదేశాలు జారీ అయిన వెంటనే... సెక్యూరిటీని తొలగిస్తూ హోంశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ నిర్ణయంతో వెయ్యి మంది పోలీసులతో పాటు, వంద వాహనాలు పోలీసు శాఖకు తిరిగి వచ్చాయి. వీటిని పోలీసు పహారాకు వినియోగించాలని నిర్ణయించారు.

మరోవైపు ఇటీవల ఉద్యోగానికి రాజీనామా చేసిన ఐఏఎస్ అధికారి షా ఫైజల్ కు ఉన్న సెక్యూరిటీని కూడా అధికారులు తొలగించారు. వేర్పాటువాదులైన అబ్దుల్ ఘనీ షా, యాసిన్ మాలిక్, మహ్మద్ ముసాదిక్ భట్, గిలానీలతో పాటు 18 మంది హురియత్ నేతలకు కూడా భద్రతను తొలగించారు.

More Telugu News