ndrf: 16 గంటల ఆపరేషన్ సక్సెస్.. బోరు బావిలో పడ్డ చిన్నారిని సురక్షితంగా బయటకు తీసిన అధికారులు!

  • మహారాష్ట్రలోని పూణేలో ఘటన
  • నిన్న ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయిన బిల్
  • అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన చిన్నారి తల్లిదండ్రులు

జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్) అధికారుల శ్రమ ఫలించింది. మహారాష్ట్రలోని పూణే జిల్లా థ్రాడేండేల్ గ్రామంలో బోరు బావిలో పడిపోయిన ఆరేళ్ల పిల్లాడిని అధికారులు రక్షించారు. నిన్న సాయంత్రం ఇంటికి సమీపంలోని పొలంలో ఆడుకుంటున్న బిల్(6) దాదాపు 200 అడుగుల లోతు ఉన్న బోరు బావిలో పడిపోయాడు. దీంతో రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ అధికారులు.. సహాయక చర్యలు ప్రారంభించారు.

రాత్రంతా బోరు బావిలోకి ఆక్సిజన్ పంపుతూ సమాంతరంగా గొయ్యిని తవ్వారు. అనంతరం పిల్లాడిని సురక్షితంగా బయటకు తీశారు. మరోవైపు తమ కుమారుడు సురక్షితంగా బయటపడటంతో పిల్లాడి తల్లిదండ్రులు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం పిల్లాడు ఆరోగ్యంగా ఉన్నాడనీ, ఎలాంటి గాయాలు కాలేదని వైద్యులు అన్నారు.

More Telugu News