Pakistan: 'ఇండియాకు సిగ్గులేదు' అన్న పాక్ లాయర్... ఆగ్రహోదగ్రుడైన హరీశ్ సాల్వే!

  • పాక్ జైల్లో మగ్గుతున్న కుల్ భూషణ్ జాదవ్
  • ఐసీజేలో కొనసాగుతున్న వాదనలు
  • పాక్ న్యాయవాది ఖవార్ ఖురేషీ భాషపై అభ్యంతరం

పాకిస్థాన్ లో ఉరిశిక్ష పడి, ప్రస్తుతం జైల్లో మగ్గుతున్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌ భూషణ్‌ జాదవ్‌ (48) కేసు విచారణ ది హేగ్ లోని అంతర్జాతీయ న్యాయస్థానంలో జరుగుతున్న వేళ, పాక్ తరఫున హాజరైన న్యాయవాది వాడిన భాషపై భారత మాజీ సొలిసిటర్ జనరల్ హరీశ్ సాల్వే తీవ్రంగా మండిపడ్డారు.

ఇండియాకు సిగ్గులేదని, అర్థం లేని వ్యాఖ్యలు చేస్తోందని, ఆ దేశం పొగరుబోతని పాక్ తన పత్రాల్లో అభ్యంతరకర భాషను వాడగా, ఇటువంటి భాషను మరోసారి వాడకుండా చర్యలు చేపట్టాలని సాల్వే కోరాడు. పాక్ తరఫున కేసులో వాదనలు వినిపించేందుకు వచ్చిన ఖవార్ ఖురేషీ ఎలా వాదించాలో తెలియని స్థితిలోనే ఈ తరహా దుర్భాషకు దిగుతున్నారని భారత్ ఆరోపించింది.

More Telugu News