Rahul Gandhi: తమిళనాడులో డీఎంకేతో పొత్తు ఖరారు చేసుకున్న కాంగ్రెస్

  • స్టాలిన్‌తో ముకుల్ వాస్నిక్ భేటీ
  • రాహుల్‌తో కనిమొళి భేటీ
  • పొత్తు ప్రకటన చేసిన స్టాలిన్‌, ముకుల్

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుంటే.. నేడు కాంగ్రెస్, డీఎంకేతో పొత్తు ఖరారు చేసుకుంది. నేడు ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో డీఎంకే ఎంపీ కనిమొళితో పాటు ఆ పార్టీ సీనియర్ నేతలు భేటీ అయ్యారు. మరోవైపు డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌తో తమిళనాడు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ముకుల్ వాస్నిక్ భేటీ అయ్యారు.

ఈ చర్చల అనంతరం స్టాలిన్, ముకుల్ వాస్నిక్ పొత్తు ప్రకటన చేశారు. తమిళనాడులో 39 లోక్‌సభ స్థానాలకు గాను 9 స్థానాలలోనూ, పుదుచ్చేరిలో 1 స్థానంలోను కాంగ్రెస్ పోటీ చేయనుంది. 20కి పైగా స్థానాల్లో డీఎంకే పోటీ చేయనుంది. మిగిలిన సీట్లను కూటమి భాగస్వామ్య పక్షాలైన ఎండీఎంకే, సీపీఎం, వీసీకే, ఎంఎంకేలకు కేటాయించనున్నారు.

More Telugu News