Shamitha Shetty: నేనూ మనిషినే.. నాకూ బాధలుంటాయి: షమిత శెట్టి

  • నా ఆరోగ్యం బాగోలేదు
  • ఓపిక నశించినా నవ్వడానికి ప్రయత్నించా
  • అభిమానులను గౌరవిస్తా
  • ఇలాంటి వాటికి సాధారణంగా స్పందించను

తాను ఎంత ఓపికగా ఉన్నప్పటికీ తనపై మీడియా, నెటిజన్లు కామెంట్లు చేయడంపై బాలీవుడ్ నటి షమిత శెట్టి ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా షమితతో కలిసి ఫోటోలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఆమె విసుక్కుంటూ అభిమానులతో ఫోటోలు దిగారు. ఆమె దురుసు ప్రవర్తన కారణంగానే అభిమానులు నిరాశకు గురయ్యారని మీడియా సంస్థలు వార్తలను ప్రచురించాయి. నెటిజన్లు సోషల్ మీడియాలో ఆమెను బాగా ట్రోల్ చేశారు. దీంతో నొచ్చుకున్న షమిత సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

తన ఆరోగ్యం బాగోలేదని అయినా తన కోసం ఎదురు చూసిన అభిమానులతో ఫోటోలు దిగానని పేర్కొన్నారు. ఓపిక నశించినా.. మెడనొప్పి ఉన్నా నవ్వడానికి యత్నించానని తెలిపింది. సోషల్ మీడియాలో విమర్శలు వస్తుంటాయని తెలుసని.. అక్కడ మాత్రమే ప్రజలు సులభంగా అభిప్రాయాన్ని చెప్పగలరన్నారు. అభిమానులను చాలా గౌరవిస్తానని.. వారి ప్రేమ చాలా గొప్పదని.. జీవితాంతం అలాగే ఉంటుందని షమిత పేర్కొంది. సాధారణంగా తాను ఇలాంటి వాటికి స్పందించనని.. కానీ ప్రస్తుతం స్పందించాల్సి వచ్చిందని తెలిపింది. ఈ విషయంలో తాను చాలా బాధపడ్డానని పేర్కొంది. తనూ మనిషినేనని.. బాధలుంటాయని.. సానుకూలంగా స్పందించటం నేర్చుకుందామని షమిత పోస్టులో స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News