KTR: అందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వడమే మా లక్ష్యం: కేటీఆర్

  • అర్హులైన అందరి జాబితా ప్రభుత్వం వద్ద ఉంది
  • ఒక్క పైసా కూడా లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు
  • సిరిసిల్లను ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా

తెలంగాణలో అందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాలనేదే తమ లక్ష్యమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ త్వరలోనే గృహాలను మంజూరు చేస్తామని చెప్పారు. సిరిసిల్లలో ఈరోజు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇళ్ల మంజూరు కోసం ఎవరికీ డబ్బు ఇవ్వొద్దని సూచించారు. ఒక్క పైసా కూడా లంచం ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు. అర్హులైన అందరి జాబితా ప్రభుత్వం వద్ద ఉందని... అందరికీ ఇళ్లను అందిస్తామని తెలిపారు. సిరిసిల్ల చేనేత కార్మికులు తయారు చేస్తున్న చీరల్లో సరికొత్త డిజైన్లు తీసుకొస్తామని చెప్పారు. నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. 

  • Loading...

More Telugu News