Pulwama: అమర జవానుల కుటుంబీకులను పరామర్శించిన రాహుల్, ప్రియాంక

  • అమిత్ కుటుంబానికి ఓదార్పు
  • కన్నీరుమున్నీరైన అమిత్ కుటుంబం
  • ప్రదీప్ ఫోటో వద్ద రాహుల్ పుష్పాంజలి
పుల్వామా దాడిలో అమరులైన జవానుల కుటుంబాలను నేడు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ సెక్రటరీ జనరల్ ప్రియాంక గాంధీ వాద్రా పరామర్శించారు. శామ్లీలోని అమిత్ కోరీ, ప్రదీప్ కుమార్ నివాసాలకు వెళ్లి అమరవీరులకు పుష్పాంజలి ఘటించారు. వీరితోపాటు కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నేతలు జ్యోతిరాదిత్య సింధియా, రాజ్‌ బబ్బర్ ఉన్నారు.

మొదటగా నేతలు అమిత్ కుటుంబాన్ని కలిసి ఓదార్చారు. కాంగ్రెస్ నేతలను చూడగానే అమిత్ కుటుంబీకులు బోరున విలపించారు. ప్రియాంక.. అమిత్ భార్యను కౌగిలించుకుని ఓదార్చారు. దాదాపు 15 నిమిషాలపాటు అమిత్ కుటుంబీకులతో గడిపిన అనంతరం కాంగ్రెస్ నేతలు ప్రదీప్ ఇంటికి వెళ్లారు. అక్కడ రాహుల్ ప్రదీప్ ఫోటో వద్ద పుష్పాంజలి ఘటించారు.
Pulwama
Rahul Gandhi
Priyanka Gandhi
Amith kori
Pradeep Kumar
Raj Babbar

More Telugu News