kolkata: శారదా చిట్ ఫండ్ కేసు విచారణ ధర్మాసనం నుంచి వైదొలగిన జస్టిస్ నాగేశ్వరరావు

  • గతంలో బెంగాల్ సర్కార్ తరపున నాగేశ్వరరావు వాదన
  • అందుకే, ఈ పిటిషన్ పై విచారణకు ఆయన విముఖత
  • ఈ నెల 27కు వాయిదాపడ్డ విచారణ
శారదా చిట్ ఫండ్ కుంభకోణం దర్యాప్తునకు సంబంధించి సీబీఐ వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఈరోజు జరగాల్సిన విచారణ వాయిదా పడింది. ఈ కేసు దర్యాప్తునకు పశ్చిమ బెంగాల్ అధికారులు సహకరించడం లేదంటూ సీబీఐ దాఖలు చేసిన ఈ పిటిషన్ పై విచారణ నిమిత్తం ఏర్పాటు చేసిన త్రిసభ్య ధర్మాసనం నుంచి జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు వైదొలిగారు. ఈ కేసుకు సంబంధించి గతంలో బెంగాల్ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించానని, అందువల్లే, ఈ పిటిషన్ పై విచారణకు తాను విముఖత చూపుతూ వైదొలగుతున్నట్టు చెప్పారు. దీంతో, ఈ పిటిషన్ పై విచారణ ఈ నెల 27కు వాయిదా పడింది. కాగా, ఈ పిటిషన్ పై విచారణ నిమిత్తం ఇంతకుముందు సీజేఐ రంజన్ గొగొయ్, జస్టిస్ నాగేశ్వరరావు, జస్టిస్ సంజీవ్ ఖన్నాతో కూడిన త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు.
kolkata
sarada chit fund
fraud
cbi
Supreme Court
justice nageswara rao

More Telugu News