hyderabad: హైదరాబాదులోని నారాయణ స్కూల్లో అగ్నిప్రమాదం

  • అశోక్ నగర్ లోని నారాయణ స్కూల్లో అగ్నిప్రమాదం
  • ఏసీ నుంచి చెలరేగిన మంటలు
  • షార్ట్ సర్క్యూట్ కారణమని సమాచారం

హైదరాబాద్ అశోక్ నగర్ లో ఉన్న నారాయణ స్కూల్లో అగ్నిప్రమాదం సంభవించింది. స్కూల్లోని ఒక క్లాస్ రూమ్ లో ఉన్న ఏసీ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో, స్కూల్ మొత్తం పొగ వ్యాపించడంతో సిబ్బంది, విద్యార్థులు భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం సంభవించినట్టు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News