Guntur District: కొండవీడు గ్రామానికి చంద్రబాబు హెలికాప్టర్ లో వెళ్లాలా?: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

  • అమరావతికి 50 కిలోమీటర్ల దూరంలో కొండవీడు ఉంది
  • బాబు గంట సేపు రోడ్డుపై ప్రయాణించలేరా?
  • మృతుడి కుటుంబానికి రూ.50 లక్షల నష్ట పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి

కొండవీడు రోడ్డు ప్రారంభానికి ఇంత హంగామా ఎందుకు? అమరావతికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండవీడు గ్రామానికి హెలికాప్టర్ లో వెళ్లాలా? అని సీఎం చంద్రబాబును వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు. రాజకీయ అవసరాల కోసం రోజుకో రాష్ట్రం తిరిగే బాబు గంట సేపు రోడ్డుపై ప్రయాణించలేరా? అని ప్రశ్నించారు. హెలిపాడ్ కోసం చివరకు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నారని, హాస్పిటల్ కు తీసుకెళ్లకుండా అడ్డుకుంటారా? పేదల ప్రాణాలకు కనీస విలువ లేకుండా పోయింది మీ పాలనలో అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు హెలిపాడ్ కోసం పిట్టల కోటయ్య అనే రైతును దారుణంగా కొట్టి చంపిన ఘటనపై కేంద్ర మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేయాలని కోరారు. సీఎం, డీజీపీలను బాధ్యులుగా చేసి దర్యాప్తునకు ఆదేశించాలని, సీఎం హెలిపాడ్ కోసం పంట చేను ధ్వంసం చేసి రైతును కొట్టి చంపిన పోలీసు అధికారులపై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇది ప్రభుత్వం చేసిన క్రూర హత్య అని, చంద్రబాబు దీనికి బాధ్యత వహించాలని అన్నారు. మృతుడు కోటయ్య కుటుంబానికి రూ.50 లక్షల నష్ట పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు.


  • Loading...

More Telugu News