kasturi shivarao: ఖరీదైన కార్లో తిరిగిన కస్తూరి శివరావు .. డొక్కు సైకిల్ పై వెళుతుండటం చూశాను: సీనియర్ నటుడు రావి కొండలరావు

  • కస్తూరి శివరావు ఒకప్పటి టాప్ కమెడియన్
  • ఖరీదైన కారు కలిగిన ముగ్గురిలో ఆయన ఒకరు
  • నాగేశ్వరరావు గారే ఈ విషయం చెప్పారు    
తెలుగు తెరపై తొలితరం హాస్య నటుల్లో కస్తూరి శివరావు ఒకరుగా కనిపిస్తారు. కస్తూరి శివరావు పేరు వినగానే 'గుణసుందరి కథ' గుర్తుకు వస్తుంది. ఆ సినిమాలో ఆయన చేసిన సందడి కళ్ల ముందు కదలాడుతుంది. ఎన్నో చిత్రాల్లో విలక్షణమైన పాత్రలను పోషించిన ఆయన గురించి, ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో రావి కొండలరావు ప్రస్తావించారు.

"కస్తూరి శివరావు ఒకప్పుడు టాప్ కమెడియన్. అప్పట్లో 'ప్యూక్' చాలా ఖరీదైన కారు .. చెన్నైలో ముగ్గురికి మాత్రమే ఆ కారు ఉండేది. ఆ ముగ్గురులో కస్తూరి శివరావు ఒకరు. ఆ కారులో ఆయన పాండీ బజారులో వెళుతుండటం నేను చూశాను. ఆ తరువాత అదే శివరావు డొక్కు సైకిల్ తొక్కుకుంటూ అదే పాండీ బజారులో వెళుతుండటమూ చూశాను.

'బాలరాజు' సినిమా హండ్రెడ్ డేస్ ఫంక్షన్ కి వెళితే, హీరో అక్కినేని నాగేశ్వరరావును చూడటానికంటే, కమెడియన్ అయిన కస్తూరి శివరావును చూడటానికి జనం ఎక్కువగా ఆసక్తిని చూపించారట .. ఈ విషయాన్ని ఒకసారి నాగేశ్వరరావుగారే నాకు చెప్పారు. అంతటి పేరు తెచ్చుకున్న శివరావు చనిపోతే .. ఆయన శవం వెనుక వెళ్లింది నేను కాకుండా మరో అయిదుగురు మాత్రమే" అని చెప్పుకొచ్చారు. 
kasturi shivarao

More Telugu News