sharwanad: 250 మంది డాన్సర్లతో శర్వానంద్ - కాజల్ సాంగ్

  • సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్
  •  స్పెయిన్ లో కొనసాగుతోన్న షూటింగ్
  •  నాయికలుగా కాజల్ .. కల్యాణి ప్రియదర్శన్  

శర్వానంద్ నుంచి ఇటీవల వచ్చిన 'పడి పడి లేచె మనసు' ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయింది. ఆయన తదుపరి సినిమా .. సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ సినిమాలో శర్వానంద్ డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు. ఒక కథానాయికగా కాజల్ .. మరో కథానాయికగా కల్యాణి ప్రియదర్శన్ నటిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ 'స్పెయిన్'లో జరుగుతోంది. అక్కడ 250 మంది డాన్సర్లు పాల్గొనగా .. శర్వానంద్ - కాజల్ పై ఒక సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మితమవుతోన్న ఈ సినిమా, గ్యాంగ్ స్టర్ డ్రామాగా కొనసాగుతుంది. త్వరలోనే టైటిల్ ను ఖరారు చేయనున్నారు. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ ఇస్తుందనే నమ్మకంతో శర్వానంద్ వున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి. 

More Telugu News