srinu vaitla: మొత్తానికి మంచువారి అబ్బాయిని ఒప్పించేసిన శ్రీను వైట్ల

  • పరాజయాలతో శ్రీను వైట్ల సతమతం
  •  హిట్ కోసం మంచు విష్ణు వెయిటింగ్
  • త్వరలో ఈ ఇద్దరూ సెట్స్ పైకి
ఒకప్పుడు వరుస విజయాలతో దూసుకుపోయిన శ్రీను వైట్ల, కొంతకాలంగా వరుస పరాజయాలను ఎదుర్కుంటూ వస్తున్నాడు. ఆయన ఎంతో ఆశ పెట్టుకున్న 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమా కూడా నిరాశ పరిచింది. దాంతో ఇక శ్రీను వైట్లకి ఛాన్స్ ఇచ్చే హీరోలు దొరకడం కష్టమేననే టాక్ వినిపించింది. కానీ ఆయనకి మంచు విష్ణు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.

మంచు విష్ణుకి కూడా కొంతకాలంగా సరైన హిట్ లేదు. ఆయన కూడా హిట్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇటీవల శ్రీను వైట్ల వినిపించిన కథ నచ్చడంతో, వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని చెప్పుకుంటున్నారు. విష్ణు సొంత బ్యానర్లోనే ఈ సినిమా వుండే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నారు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే బయటికి వచ్చే అవకాశం వుంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన 'ఢీ' ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.
srinu vaitla
manchu vishnu

More Telugu News