P narayana: ఆమంచి, అవంతి టీడీపీని అందుకే వీడారు!: ఏపీ మంత్రి నారాయణ

  • సర్వేల్లో వారికి ప్రజాదరణ లేదని తేలింది
  • టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని ముందే చెప్పాం
  • అందుకే పార్టీని వీడి వెళ్లారన్న నారాయణ
రానున్న ఎన్నికల్లో మరోసారి పార్టీ టికెట్ ఇస్తే ఆమంచి కృష్ణమోహన్, అవంతి శ్రీనివాస్ లు గెలిచే అవకాశం లేదని తెలుగుదేశం పార్టీ అంతర్గతంగా జరిపించిన సర్వేలో తేలిందని, ఈ విషయాన్ని వాళ్లకు చెప్పిన తరువాతనే ఇద్దరూ పార్టీని మారారని ఏపీ మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు.

ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని వారికి చెప్పిన తరువాతే వారు వైసీపీలో చేరారని అన్నారు. పద్ధతి మార్చుకోవాలని, ప్రజలకు దగ్గర కావాలని, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేయాలని వారికి ఎన్నోమార్లు సూచించామని, తొలి నుంచి ప్రజాదరణ పొందడంలో వారు విఫలమవుతూనే ఉన్నారని అన్నారు. అటువంటి నేతలు ఒకరిద్దరు పోయినా, తెలుగుదేశం పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదని నారాయణ అభిప్రాయపడ్డారు.
P narayana
Andhra Pradesh
Politics
Telugudesam
Amanchi
Avanti

More Telugu News