narne srinivasa rao: నార్నె శ్రీనివాసరావు తనపై పోటీ చేస్తారన్న వార్తలపై గల్లా జయదేవ్ స్పందన!
- నాపై ఎవరినైనా పోటీ చేయమనండి
- ఎన్నికలు ఎక్కడైనా కష్టంగానే ఉంటాయి
- ముందు నుంచి కష్టపడితేనే గెలుపు వస్తుంది
ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ మామ, ‘నార్నె’ సంస్థల అధినేత నార్నె శ్రీనివాసరావు ఇటీవలే వైసీపీ అధినేత జగన్ ని మర్యాదపూర్వకంగా కలిసిన విషయం తెలిసిందే. వైసీపీలో ఆయన చేరతారని, గుంటూరు నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. ఈ విషయమై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ని మీడియా ప్రశ్నించగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అమరావతిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. ‘వైసీపీ తరపున మీపై నార్నె శ్రీనివాసరావు పోటీ చేస్తారని చెబుతున్నారని..’ అని అడగగా, ‘ఎవరినైనా రానీయండి. నేను మొదటిసారిగా ఇక్కడి నుంచి పోటీ చేసింది, ‘విన్నింగ్ సీటు, విన్నింగ్ ప్లేస్’ అని రాలేదు. గుంటూరు అంటే మా మామగారి ఊరు... కాబట్టి ఇక్కడికి వచ్చాను. ఎన్నికలు ఎక్కడైనా కష్టంగానే ఉంటాయి. ముందు నుంచి కష్టపడితేనే గెలుపు వస్తుంది’అని జయదేవ్ చెప్పుకొచ్చారు.