paruchuri: అలా చేసినందుకు విజయబాపినీడు గారు చాలా బాధపడ్డారట: పరుచూరి గోపాలకృష్ణ

షార్ట్స్‌లో చూడండి
తాజాగా పరుచూరి గోపాలకృష్ణ తన 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో ఒక ఆసక్తికరమైన విషయాన్ని గురించి ప్రస్తావించారు. చిరంజీవి - విజయబాపినీడు కాంబినేషన్ కోసం 'బిగ్ బాస్' కథను సిద్ధం చేశాను. చిరంజీవి గారికి వినిపిస్తే 'చాలా బాగుంది .. చేద్దాం' అన్నారు. ఆ తరువాత కొన్ని రోజులకి కథ - విజయబాపినీడు, మాటలు - సంజీవి అని పేపర్లో రావడంతో నేను షాక్ అయ్యాను. నేను రాసిన కథ నచ్చకపోతే నాకు ఒకమాట చెప్పొచ్చు గదా అనుకుని మౌనంగా వుండిపోయాను.

ఆ తరువాత చిరంజీవి గారు కబురు చేయడంతో ఆయనని కలిసినప్పుడు కూడా నేను ఇదే విషయం చెప్పాను. విజయబాపినీడు గారే వేరే కథతో వస్తే 'సరే' అన్నట్టుగా చిరంజీవిగారు చెప్పడంతో వెనక్కి వచ్చేశాను. విజయబాపినీడు చనిపోయిన రోజున ఆయన సహచరులు కొంతమంది అక్కడే వున్నారు. 'బిగ్ బాస్' విషయంలో తాను తీసుకున్న నిర్ణయానికి విజయబాపినీడు అప్పట్లో చాలా బాధపడ్డారనీ .. పరుచూరి గోపాలకృష్ణతో 'మాటలు' అయినా రాయించవలసింది అని పదే పదే అనుకున్నారని చెప్పారు అంటూ గుర్తు చేసుకున్నారు. 
Go Back to Shorts
paruchuri

More Telugu News