West Bengal: కోల్ కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ బదిలీ..కొత్త సీపీగా అనూజ్ శర్మ

  • రాజీవ్ కుమార్ కు ప.బె.సీఐడీ ఏడీజీ, ఐజీపీ బాధ్యతలు
  • కోల్ కతా కొత్త పోలీస్ కమిషనర్ గా అనూజ్ శర్మ
  • ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
శారదా కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కోల్ కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ను బదిలీ చేశారు. ఈ మేరకు మమతా బెనర్జీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్ సీఐడీ అదనపు డైరెక్టర్ జనరల్ (ఏడీజీ)గా, ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ)గా రాజీవ్ కుమార్ ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, కోల్ కతా కొత్త పోలీస్ కమిషనర్ గా శాంతి భద్రతల విభాగం ఏడీజీ అనూజ్ శర్మ బాధ్యతలు స్వీకరించనున్నారు.  
West Bengal
kolkata
cp
rajiv kumar
anuju sarma
cm
mamata banerjee
cid

More Telugu News