సీనియర్ ఆర్టిస్టులపట్ల అప్పుడున్న గౌరవం ఇప్పుడు లేదనే చెప్పాలి: వై.విజయ
- పాత తరం వాళ్లతో పనిచేశాను
- సీనియర్స్ ను గౌరవించడం తెలుసుకున్నాను
- ఇప్పుడు అంతా ఈజీగానే తీసుకుంటున్నారు
అలాంటివాళ్లతో కలిసి నటించడం వలన వృత్తిపట్ల ఎంతటి అంకితభావం ఉండాలనేది అర్థమైంది. పెద్దలను ఎలా గౌరవించాలనే విషయం తెలిసింది. చెప్పిన సమయానికి ముందుగానే లొకేషన్ లో ఉండాలనే విషయాన్ని నేర్చుకున్నాను. భయభక్తులతో మా పనిని మేం చేసే వాళ్లం. ఇప్పుడు అలాంటి వాతావరణమే లేదు. ఎవరూ ఏ విషయాన్ని సీరియస్ గా తీసుకోవడం లేదు. సీనియర్ ఆర్టిస్టుల పట్ల గౌరవం లేదు .. సెట్లో క్రమశిక్షణ కనిపించడం లేదు" అని చెప్పుకొచ్చారు.