పుల్వామా ఉగ్రదాడి.. మోదీ ప్రభుత్వంపై మమత సంచలన ఆరోపణలు
- ఐదేళ్లలో జరగని దాడి ఎన్నికల ముందు ఎందుకు జరిగింది?
- సైనికులను వాయుమార్గంలో ఎందుకు తరలించలేదు?
- చూస్తుంటే ఏదో మతలబు ఉందనిపిస్తోంది
పుల్వామా దాడి కేంద్రానికి తెలిసే జరిగిందని చెప్పేందుకు తన వద్ద పూర్తి ఆధారాలున్నాయని మమత పేర్కొన్నారు. నిఘా నివేదికలను ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఉగ్రవాదులను భారత్‌పైకి ఎగదోస్తున్న పాకిస్థాన్‌పై ఇన్నాళ్లూ ఎందుకు మౌనం వహించారని మోదీని నిలదీశారు.
ప్రచారం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రధాని జవాన్లను వాయు మార్గంలో ఎందుకు తరలించలేదని సూటిగా ప్రశ్నించారు. ఐదేళ్లుగా జరగనిది ఎన్నికలకు కొన్ని రోజుల ముందే జరిగితే ఏమని అర్థం చేసుకోవాలన్నారు. ఇందులో ఏదో మతలబు ఉండే ఉంటుందని మమత అనుమానం వ్యక్తం చేశారు.