Rajath Kumar: కేబినెట్ విస్తరణపై రాష్ట్ర, కేంద్ర ఎన్నికల కమిషన్‌కు రేవంత్ ఫిర్యాదు

  • రేపు మంత్రులుగా ప్రమాణ స్వీకారం
  • కలకలం రేపుతున్న రేవంత్ ఫిర్యాదు
  • ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
కేబినెట్ విస్తరణపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్‌కు, కేంద్ర ఎన్నికల కమిషన్‌కు నేడు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. రేపు ఉదయం 11:30 గంటలకు 10 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా.. రేవంత్ ఫిర్యాదు కలకలం రేపుతోంది. తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్  విడుదలైంది. ఈ నేపథ్యంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడం.. ఎన్నికల కోడ్ ఉల్లంఘన అవుతుందని రేవంత్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల సంఘం అనుమతి లేకుండా కేబినెట్ విస్తరణ చేపడితే చర్య తీసుకోవాలని కోరారు.
Rajath Kumar
Revanth Reddy
MLC notification
Election Commission

More Telugu News