Hyderabad: హైదరాబాద్ గాలి పీల్చితే అంతే సంగతులు.. తాజా నివేదికలో వెల్లడి

  • ప్రమాదకర స్థితిలో వాయుకాలుష్యం
  • ప్రబలుతున్న ఊపిరితిత్తుల వ్యాధులు
  • ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్

ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు హైదరాబాద్ లో వాయు కాలుష్యం పెరిగిందని నివేదికలు చెబుతున్నాయి. తాజాగా విడుదలైన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ బులెటిన్ లో హైదరాబాద్ నగరం దక్షిణాదిలో అత్యంత ప్రమాదకర నగరంగా పేర్కొన్నారు. వాయు కాలుష్య పరంగా హైదరాబాదే పరమచెత్త నగరం అని నివేదిక చెబుతోంది. ప్రభుత్వ సంస్థలు సూచించిన దానికంటే వాయు కాలుష్యం హెచ్చుస్థాయిలో ఉన్నట్టు గుర్తించారు.

సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తాజాగా ఈ బులెటిన్ ను విడుదల చేసింది. దక్షిణ భారతదేశంలో చెన్నై, తిరువనంతపురం, తిరుపతి, విశాఖపట్నం, రాజమహేంద్రవరం వంటి నగరాల కంటే హైదరాబాద్ లో వాయుకాలుష్యం ఎక్కువని, ఇక్కడి గాలిలో ప్రమాదకర విష పదార్థాలు ఉన్నట్టు నివేదికలో వెల్లడించారు. తద్వారా హైదరాబాద్ వాసులకు ఆస్తమా, హృద్రోగాలు వచ్చే ముప్పు ఎక్కువగా ఉందని నిపుణులు హెచ్చరించారు.

జంటనగరాల్లో కోటి వరకు జనాభా ఉండగా, 50 లక్షల వాహనాలు నిత్యం రోడ్లపై తిరుగుతుంటాయి. ఉన్న వాహనాలకు తోడు రోజుకు 1000 కొత్త వాహనాలు వచ్చి చేరుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాయుకాలుష్యం పెరగడంలో పెద్దగా ఆశ్చర్యమేమీ లేదని తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చెబుతోంది. ట్రాఫిక్ పెరగడమే కాలుష్యానికి కారణంగా భావిస్తున్నామని, తమవంతుగా త్వరలోనే పర్యావరణ హిత బస్సులను ప్రవేశపెడుతున్నట్టు తెలంగాణ ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.

More Telugu News