Pulwama: మనసు చలించిపోయింది.. మా వాళ్లను చూస్తే కన్నీళ్లొచ్చాయి!: ప్రాణాలతో బయటపడిన జవాను

  • ముఖాముఖి తలపడితే సమాధానం చెప్పేవాళ్లం
  • పేలుడు శబ్దం వినిపించగానే అలర్ట్ అయ్యాం
  • మా బస్సులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు
పుల్వామా ఆత్మాహుతి దాడి ఘటనలో అమరులైన తమ తోటి జవానులను చూసి మనసు చలించిపోయిందని ఈ ఘటనలో తృటిలో ప్రమాదం నుంచి బయటపడిన జవాను తెలిపారు. ఉగ్రదాడిపై ప్రశ్నించగా.. ఆయన మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన వాహనానికి తమ వాహనం దాదాపు 500 మీటర్ల దూరంలో ఉందని తెలిపారు. పేలుడు శబ్దం వినిపించగానే తామంతా అలర్ట్ అయ్యామని, వెంటనే తమ బస్సులను సురక్షిత ప్రాంతాలకు తరలించామని చెప్పారు.

ఆ తరువాత కొంత సేపటికి తాము తిరిగి ఆ ప్రదేశానికి వచ్చామని.. అక్కడి పరిస్థితులను చూసి మనసు చలించిపోయి.. కన్నీళ్లాగలేదని చెప్పారు. ఎదురుగా వచ్చి తలపడి ఉంటే జవాబు చెప్పి ఉండేవాళ్లమని, తమను దొంగ దెబ్బ తీశారని ఆవేశంగా అన్నారు. అప్పటి వరకూ తమతోనే ఉన్న తమ సహచరులు ప్రాణాలు కోల్పోవడం తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Pulwama
Terrorist Attack
Matryrs
Soldier

More Telugu News