Harish Rao: హరీశ్ రావుకు మంత్రి పదవి ఇవ్వకపోవడానికి కారణం అదే!: రేవంత్ రెడ్డి

  • అమిత్ షాతో హరీశ్ రావు రహస్యంగా మాట్లాడారు
  • ఫోన్ రికార్డులను హరీశ్ పీఏ కేసీఆర్ కు అందించారు
  • హరీశ్ కు మంత్రి పదవి ఇవ్వకపోవడానికి ఇది కూడా ఒక కారణం
తెలంగాణ మంత్రివర్గాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ విస్తరించనున్న సంగతి తెలిసిందే. తొలి విడతలో 9 మందిని మంత్రివర్గంలోకి తీసుకోనున్నారు. ఈ జాబితాలో టీఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావు పేరు లేకపోవడం చర్చనీయాంశమైంది. దీనిపై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో హరీశ్ రావు రహస్యంగా మాట్లాడారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఫోన్ రికార్డులను హరీశ్ పీఏ స్వయంగా కేసీఆర్ కు అందజేశారని చెప్పారు. హరీశ్ కు మంత్రి పదవి ఇవ్వకపోవడానికి ఇది కూడా ఒక కారణమని అన్నారు. రేవంత్ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో వేడిని పుట్టిస్తున్నాయి.
Harish Rao
TRS
kct
Revanth Reddy
congress

More Telugu News