nani: నాని సినిమాలో విలన్ గా 'ఆర్ ఎక్స్ 100' హీరో ఖాయమైపోయాడు

  • ముగింపు దశలో నాని 'జెర్సీ'
  • ఈ రోజే పట్టాలెక్కిన కొత్త ప్రాజెక్టు
  • ఆనందాన్ని వ్యక్తం చేసిన కార్తికేయ

నాని క్రికెటర్ గా చేస్తోన్న 'జెర్సీ' ముగింపు దశకి చేరుకుంది. ఈ సినిమా పనులు విడుదల దిశగా కొనసాగుతుండగానే, విక్రమ్ కుమార్ కి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ సినిమాలో నాని సరసన ఐదుగురు కథానాయికలు కనిపించనున్నట్టు వార్తలు వచ్చాయి. వాళ్లలో కీర్తి సురేశ్ .. మేఘ ఆకాశ్ .. ప్రియా వారియర్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. అలాగే ఈ సినిమాలో విలన్ గా 'ఆర్ ఎక్స్ 100' హీరో కార్తికేయ చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి.

ఆ వార్తల్లో నిజం ఉందనేది, ఈ రోజున ఈ సినిమా లాంచ్ సందర్భంలో తేలిపోయింది. ఎందుకంటే ఈ సినిమా పూజా కార్యక్రమాలకి కార్తికేయ కూడా హాజరయ్యాడు. అంతేకాదు నాని .. విక్రమ్ కుమార్ కాంబినేషన్లో ఈ సినిమా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని ట్వీట్ చేశాడు. అయితే పైన పేర్కొన్న ముగ్గురు కథానాయికలు కాకుండా, ఈ రోజున పూజా కార్యక్రమాల్లో మరో కథానాయిక కూడా మెరిసింది. ఈ కొత్తమ్మాయి ఎవరనే విషయమే తెలియాల్సి వుంది.

More Telugu News