Chandrababu: చంద్రబాబు కల్తీ కూటమిని ప్రజలు నిర్వీర్యం చేస్తారు: జీవీఎల్

  • ప్రజాధనాన్ని చంద్రబాబు దుర్వినియోగం చేస్తున్నారు
  • బాబుకు రాజకీయ ఎజెండా తప్ప అభివృద్ధి, విజన్ లేవు
  • కేంద్ర ప్రభుత్వ పథకాలను నీరుగారుస్తున్నారు
చంద్రబాబు తన స్వలాభం కోసమే కూటమి కడుతున్నారని, ఈ కల్తీ కూటమిని ప్రజలు నిర్వీర్యం చేస్తారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. కరీంనగర్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కూటమి పేరిట రాష్ట్రాలు తిరుగుతూ ప్రజాధనాన్ని చంద్రబాబు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు రాజకీయ ఎజెండా తప్ప అభివృద్ధి, విజన్ లేవని, 600 హామీలు ఇచ్చిమాట తప్పారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు దొంగ దీక్షలు, దొంగ డ్రామాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ఏపీతో పాటు తెలంగాణ కూడా నీరుగారుస్తోందని, ఆయుష్మాన్ భారత పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని ఈ సందర్బంగా జీవీఎల్ డిమాండ్ చేశారు. 
Chandrababu
Telugudesam
bjp
gvl
mp
kcr

More Telugu News