gopichand: సినీ నటుడు గోపీచంద్ కు ప్రమాదం.. స్వల్ప గాయాలు

  • మండవ వద్ద గోపీచంద్ సినిమా షూటింగ్
  • బైక్ ఛేజింగ్ సన్నివేశాల సందర్భంగా ప్రమాదం
  • వెంటనే ఆసుపత్రికి తరలింపు
టాలీవుడ్ హీరో గోపీచంద్ ప్రమాదానికి గురయ్యాడు. జైపూర్ దగ్గర ఉన్న మాండవలో ఆయన కొత్త సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా బైక్ పై ఛేజింగ్ సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా, బైక్ స్కిడ్ అయి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గోపీచంద్ గాయపడ్డాడు. ఈ ప్రమాదంతో ఆయన స్వల్పంగా గాయపడ్డాడు. వెంటనే చిత్ర యూనిట్ ఆయనను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గోపీచంద్ ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం లేదని, గాయాలకు చికిత్స చేయించుకున్న తర్వాత షూటింగ్ లో పాల్గొనవచ్చి అక్కడి ఫోర్టీస్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. వాస్తవానికి ఈరోజుతో అక్కడి షూటింగ్ పూర్తికానుంది. ప్రస్తుతం అనిల్ సుంకర నిర్మిస్తున్న భారీ యక్షన్ చిత్రంలో గోపీచంద్ నటిస్తున్నాడు. తిరు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
gopichand
tollywood
accident

More Telugu News