nani: విక్రమ్ కుమార్ దర్శకుడిగా నాని సినిమా లాంచ్

  • విక్రమ్ కుమార్ తో నాని
  • నిర్మాతలుగా మైత్రీ మూవీ మేకర్స్ 
  • త్వరలో రెగ్యులర్ షూటింగ్

కథాకథనాల విషయంలో విక్రమ్ కుమార్ చాలా శ్రద్ధ తీసుకుంటాడు. తాను అనుకున్న విధంగా స్క్రిప్ట్ వచ్చేవరకూ ఆయన సెట్స్ పైకి వెళ్లడు. ఇక నాని కూడా అంతే .. కథ - తన పాత్రకి సంబంధించిన పూర్తి క్లారిటీ లేకుండా కెమెరా ముందుకురాడు. అలాంటి ఈ ఇద్దరి కాంబినేషన్లో .. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో ఒక సినిమా రూపొందనుందనే టాక్ కొంతకాలంగా వినిపిస్తూ వస్తోంది. తాజాగా ఈ సినిమా కొంతసేపటి క్రితం పూజా కార్యక్రమాలను జరుపుకుంది. పూజ అనంతరం నిర్మాతలు పూర్తి బౌండ్ స్క్రిప్ట్ ను విక్రమ్ కుమార్ కి అందజేశారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఇది నానికి 24వ సినిమా .. ఈ సినిమా తనకి తప్పకుండా సక్సెస్ ను ఇస్తుందనే నమ్మకంతో ఆయన వున్నాడు. ఆ నమ్మకాన్ని విక్రమ్ కుమార్ ఎంతవరకూ నిలబెడతాడో చూడాలి మరి. 

More Telugu News