Ramgopal Varma: ఎవ్వరికీ తెలియని ఎన్టీఆర్ రహస్యాలు... రమాప్రభ చెప్పారన్న రామ్ గోపాల్ వర్మ!

  • 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ప్రమోషన్ లో బిజీగా ఉన్న రామ్ గోపాల్ వర్మ
  • డీప్, డార్క్ సీక్రెట్స్ తెలిశాయి. 
  • ట్విట్టర్ లో మరో ఆసక్తికర పోస్ట్
ప్రస్తుతం తాను తీసిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, తన ట్విట్టర్ ఖాతాలో మరో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ఎన్టీఆర్ గురించిన ఎవ్వరికీ తెలియని ఎన్నో రహస్యాల గురించి సీనియర్ నటి రమాప్రభ తనకు చెప్పారని ఆయన అన్నారు. "ఎంతో అందమైన రమాప్రభ గారు, నాకు ఎన్టీఆర్ గురించిన లోతైన ఎవ్వరికీ తెలియని రహస్యాల గురించి చెప్పారు" అని ట్వీట్ చేశారు. రమాప్రభతో తాను దిగిన ఓ ఫోటోను ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ తన అభిమానులతో పంచుకున్నారు.



Ramgopal Varma
NTR
Ramaprabha
Twitter
Dark Secrets

More Telugu News