రాయలసీమలో మొదలైన ఎండలు!
- తిరుపతిలో 37 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రత
- మరో వారంలో 40 డిగ్రీలను దాటవచ్చు
- 3 డిగ్రీల వరకూ పెరిగిన రాత్రి ఉష్ణోగ్రత
- కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షానికి చాన్స్
అయితే, పడమర గాలులు వీస్తున్న కారణంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో మాత్రం రాత్రి పూట చలి కొనసాగుతోంది. వచ్చే రెండు రోజులూ రాయలసీమ, కోస్తా, తెలంగాణ ప్రాంతాల్లో పొడి వాతావరణమే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదిలావుండగా, తెలంగాణపై ఉపరితల ఆవర్తనం ఏర్పడి, తమిళనాడు వరకూ విస్తరించింది. దీని ప్రభావంతో కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షం కురవవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది.