'గీత గోవిందం' దర్శకుడితో అఖిల్ తదుపరి సినిమా?
- అఖిల్ 4వ సినిమాకి సన్నాహాలు
- నాగార్జున దృష్టిలో పరశురామ్
- గీతా ఆర్ట్స్ బ్యానర్లో నిర్మాణం
తాజాగా ఇప్పుడు 'గీత గోవిందం' దర్శకుడు పరశురామ్ పేరు తెరపైకి వచ్చింది. 'గీత గోవిందం' చూసిన తరువాత, ఆ కథను పరశురామ్ హ్యాండిల్ చేసిన తీరు నాగార్జునకి బాగా నచ్చిందట. దాంతో ఆయనతో అఖిల్ సినిమా వుంటే బాగుంటుందని భావించినట్టు సమాచారం. ఈ కారణంగానే అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నట్టుగా చెబుతున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పైనే ఈ సినిమా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టు విషయంలో క్లారిటీ రానుంది.