Eluru: బీసీ డిక్లరేషన్...ప్రతి ఏటా బీసీల అభివృద్ధికి రూ.15 వేల కోట్లు ఖర్చు చేస్తాం: వైఎస్ జగన్

  • ఐదేళ్లలో రూ.75 వేల కోట్లు ఖర్చు చేస్తాం
  • బీసీ సబ్ ప్లాన్ తీసుకొస్తాం
  • ప్రతి కులానికి ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం

వచ్చే ఎన్నికల్లో తాను అధికారంలోకొస్తే బీసీల కోసం చేసే అభివృద్ధి పనులను వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు. ఏలూరులో జరుగుతున్న బీసీ గర్జన సభలో ఆయన బీసీ డిక్లరేషన్ లోని అంశాలను వివరిస్తున్నారు. ప్రతి ఏటా బీసీల అభివృద్ధి కోసం రూ.15 వేల కోట్లు, ఐదేళ్లలో రూ.75 వేల కోట్లు ఖర్చు చేస్తానని, బీసీ సబ్ ప్లాన్ తీసుకొస్తామని, తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే దీనికి చట్టబద్ధత కల్పిస్తామని, బీసీల్లోని ప్రతి కులానికి విడివిడిగా ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని, 45 ఏళ్లు నిండిన ప్రతి బీసీ మహిళకు వైఎస్ఆర్ చేయూత కింద రూ.75 వేల సాయం అందజేస్తామని, గ్రామ వాలంటీర్లతో నేరుగా వాళ్ల ఇంటికే డబ్బు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు.

తల్లిదండ్రులు తమ పిల్లలను ఏ చదువైనా చదివించుకోవచ్చని, అందుకు ఎన్ని లక్షలు ఖర్చయినా ఉచితంగా చదివిస్తామని, హాస్టల్ లో ఉండి చదువుకునే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.20 వేలు, పిలల్లను బడికి పంపించే ప్రతి తల్లికి ఏటా రూ.15 వేలు ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. శాశ్వతంగా బీసీ కమిషన్ పని చేసేలా చట్టబద్ధత కల్పిస్తామని, కులం సర్టిఫికెట్లు, గ్రూప్ ల మార్పిడి, ఎంబీసీలతో పాటు బీసీల సమస్యలు పరిష్కరించేందుకు ఈ కమిషన్ పనిచేస్తుందని చెప్పారు. బీసీ ఉపకులాల్లో ఉన్న డిమాండ్లను వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఈ కమిషన్ ద్వారా పరిష్కరిస్తామని జగన్ హామీ ఇచ్చారు. 

More Telugu News