Andhra Pradesh: జనసేన కార్యాలయం ముందు ఆశావహుల క్యూ.. ఒక్కరోజే 265 దరఖాస్తులు!

  • అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న స్క్రీనింగ్ కమిటీ
  • తొలి దరఖాస్తు సమర్పించిన పవన్ కల్యాణ్
  • ఆ తర్వాత నాదెండ్ల మనోహర్ దరఖాస్తు సమర్పణ
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీల్లో చేరికలు చురుగ్గా సాగుతున్నాయి. తాజాగా అమరావతిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయం ముందు ఆశావహులైన నేతలు క్యూ కడుతున్నారు. విద్యావంతులు, మహిళలు స్క్రీనింగ్ కమిటీ ముందు హాజరై ఎన్నికల్లో పోటీ కోసం తమ దరఖాస్తులను సమర్పిస్తున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఈరోజు మొత్తం 265 దరఖాస్తులు వచ్చాయి. స్క్రీనింగ్ కమిటీకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన బయోడేటాతో కూడిన తొలి దరఖాస్తును సమర్పించారు. ఆయన తర్వాత మరో నేత మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ నిన్న తెనాలి నుంచి జనసేన అభ్యర్థిత్వం కోరుతూ దరఖాస్తు ఇచ్చారు.
Andhra Pradesh
Jana Sena
amaravati office
candidates
265 applications

More Telugu News