Jammu And Kashmir: కశ్మీర్ వేర్పాటువాదులకు షాక్.. పోలీస్ భద్రతను ఉపసంహరించుకున్న రాష్ట్ర ప్రభుత్వం!

  • పుల్వామా దాడి నేపథ్యంలో ఘటన
  • జాబితాలో మిర్వాజ్ ఫరూక్, షాబిర్ షా
  • సాయంత్రంలోగా భద్రత ఉపసంహరణ
జమ్మూకశ్మీర్ లోని పుల్వామాలో ఉగ్రదాడి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉగ్రమూకలకు ప్రత్యక్ష, పరోక్ష అండదండలు అందిస్తున్న వేర్పాటువాద నేతలకు భద్రతను ఉపసంహరించుకుంది. ఈరోజు సాయంత్రంలోగా మిర్వాజ్‌ ఉమర్‌ ఫరూఖ్‌తో పాటు అబ్దుల్‌ గనీ భట్‌, బిలాల్‌ లోనే, హశిమ్‌ కురేషీ, షాబిర్‌ షాలకు కల్పిస్తున్న భద్రతను వెనక్కు తీసుకోవాలని పోలీస్ శాఖను ఆదేశించింది.

అంతేకాకుండా వీరి రక్షణకు ఇచ్చిన ప్రభుత్వ వాహనాలు, ఇతర సౌకర్యాలను ఉపసంహరించుకున్నారు. పుల్వామాలోని అవంతిపొరాలో గత గురువారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో జైషే కమాండర్ ఆదిల్ అహ్మద్ దార్ 100-150 కేజీల హైగ్రేడ్ ఆర్డీఎక్స్ ను వాడినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.
Jammu And Kashmir
pulawama terror attack
security
withdraw
Police
separatists

More Telugu News