bihar: పట్నా మెట్రో రైల్ ప్రాజెక్ట్ కు ప్రధాని మోదీ శంకుస్థాపన

  • రూ.13 వేల కోట్లతో పట్నా మెట్రో రైల్ ప్రాజెక్టు 
  • ఊర్జా గంగా యోజనతో బీహార్ కు ఎంతో ప్రయోజనం
  • ప్రజల గుండెల్లో ఎంత బాధ ఉందో నాలోనూ అంతే ఉంది
పుల్వామాలో సీఆర్పీఎప్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడిపై ప్రజల గుండెల్లో ఎంత బాధ ఉందో తనకూ అంతే ఉందని ప్రధాని మోదీ భావోద్వేగ ప్రసంగం చేశారు. పట్నా మెట్రో రైల్ ప్రాజెక్ట్ కు ఆయన శంకుస్థాపన చేశారు. రూ.13 వేల కోట్లతో పట్నా మెట్రో రైల్ ప్రాజెక్టుని ఏర్పాటు చేశారు. అనంతరం, బరౌనిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, దేశ ప్రజల గుండెలు ఎంతగా రగులుతున్నాయో అర్థం చేసుకోగలనని అన్నారు.

ఊర్జా గంగా యోజనతో బీహార్ కు ఎంతో ప్రయోజనం ఉంటుందని, ఈ పథకంతో బీహార్ అభివృద్ధికి బాటలు వేసుకోవాలని కోరారు. ఈ పథకం ద్వారా బీహార్ తో పాటు యూపీ, జార్ఖండ్, బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. ఈ రాష్ట్రాలన్నీ గ్యాస్ పైప్ లైన్ తో అనుసంధానమైన విషయాన్ని మోదీ గుర్తుచేశారు.
bihar
patna metro rail project

More Telugu News