Telangana: కేసీఆర్ పుట్టినరోజు స్పెషల్.. అదరగొడుతున్న ‘మనసున్న మారాజు’ వీడియో సాంగ్!

  • విడుదల చేసిన టీఆర్ఎస్ నేత బాల్కసుమన్
  • పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు
  • ‘మనసున్న మారాజు’ అంటూ సాగే పాట

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు(కేసీఆర్) పుట్టినరోజు నేడు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, ఏపీ ప్రతిపక్ష నేత జగన్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ సహా పలువురు రాజకీయ ప్రముఖులు కేసీఆర్ కు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా టీఆర్ఎస్ నేత బాల్క సుమన్ కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రత్యేక గీతాన్ని విడుదల చేశారు. మనసున్న మారాజు కేసీఆర్ అంటూ సాగుతున్న ఈ పాట మనసుకు హత్తుకునేలా ఉంది. ఈ వీడియో గీతాన్ని మీరూ చూసేయండి.

More Telugu News