Telangana: తెలంగాణ కొత్త జిల్లాలకు కలెక్టర్, ఎస్పీల ప్రకటన!

  • నేటి నుంచి రెండు కొత్త జిల్లాలు
  • పొరుగు జిల్లాల అధికారులకు అదనపు బాధ్యతలు
  • ములుగు కలెక్టర్ గా వెంకటేశ్వర్లు
  • నారాయణపేటకు రొనాల్డ్ రోస్
తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి ఏర్పాటవుతున్న ములుగు, నారాయణపేట జిల్లాలకు కలెక్టర్, ఎస్పీలను సర్కారు ప్రకటించింది. నేడు రెండు జిల్లాల్లో కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ములుగు కలెక్టర్ గా ప్రస్తుతం భూపాలపల్లి జిల్లా కలెక్టర్ గా ఉన్న వెంకటేశ్వర్లును, ఎస్పీగా అదే భూపాలపల్లి ఎస్పీగా విధుల్లో ఉన్న భాస్కరన్ కు అదనపు బాధ్యతలను అప్పగించారు. 11 మండలాలతో నారాయణపేట జిల్లా ఆవిర్భవించనుండగా, కలెక్టర్ గా మహబూబ్ నగర్ కలెక్టర్ రొనాల్డ్ రోస్, ఎస్పీగా రెమా రాజేశ్వరిలకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Telangana
New Districts
Mulugu
Narayanpet

More Telugu News