janasena party: ‘జనసేన’ స్క్రీనింగ్ కమిటీకి తన బయోడేటా సమర్పించిన నాదెండ్ల మనోహర్
- ‘జనసేన’ కార్యాలయంలో ఆశావహుల సందడి
- అభ్యర్థిత్వం ఆశిస్తున్న విద్యావంతులు, మహిళలు
- తుది గడువు ప్రకటించే వరకూ బయో డేటాల స్వీకరణ
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున బరిలో నిలిచేందుకు విద్యావంతులు, వృత్తి నిపుణులు, మహిళలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ బయో డేటాలను పార్టీ కార్యాలయంలో సమర్పిస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి తమ బయో డేటాలు ఇచ్చేందుకు వరుస కట్టారు. జనసేన పార్టీ ముఖ్య నాయకుడు నాదెండ్ల మనోహర్, తెనాలి నుంచి అభ్యర్థిత్వం కోరుతూ స్క్రీనింగ్ కమిటీకి తన బయోడేటాను అందజేశారు. పార్టీ నిర్దేశించిన నమూనాను నింపి ఫార్మ్ ను సమర్పించారు.
ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, పార్టీ నియమావళిని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎంత క్రమశిక్షణతో అనుసరిస్తారో, అదే విధంగా తమ నాయకులు, జనసైనికులు కూడా అనుసరిస్తారని అన్నారు. తొలి బయో డేటాను స్క్రీనింగ్ కమిటీకి సమర్పించిన పవన్ కల్యాణ్ ఈ నియమావళిని అనుసరించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. కాగా, రేపు ఆదివారం అయినప్పటికీ ఆశావహుల బయో డేటాలు తీసుకుంటామని, తుది గడువు ప్రకటించే వరకూ బయో డేటాల స్వీకరణ కొనసాగుతుందని స్క్రీనింగ్ కమిటీ పేర్కొంది.