Telangana: వికారాబాద్ జిల్లాలోని గ్రామంలో హైవోల్టేజీ సమస్య.. ఒకరు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు!

  • జిల్లాలోని బషీరాబాద్ మండలంలో ఘటన
  • కాలిబూడిదైన ఎలక్ట్రానిక్ పరికరాలు
  • ఇంకా స్పందించని విద్యుత్ శాఖ అధికారులు
తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇక్కడి బషీరాబాద్ మండలం కంసన్ పల్లి గ్రామంలో ఈరోజు ఒక్కసారిగా హైవోల్టేజ్ విద్యుత్ ప్రసారం జరిగింది. దీంతో ఊరిలోని ట్రాన్స్ ఫార్మర్లతో పాటు ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ కాలి బూడిద అయ్యాయి. ఈ సందర్భంగా విద్యుత్ పరికరాలను వాడుతున్న ఓ వ్యక్తి కరెంట్ షాక్ తో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.

దీంతో గ్రామస్తులు వీరిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఈ ఘటనపై జిల్లా విద్యుత్ అధికారులు ఇంకా స్పందించలేదు. కాగా, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ దుర్ఘటన చోటుచేసుకుందనీ, తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి.
Telangana
vikarabad
high voltage shock
one dead
Police

More Telugu News