మోదీకి పూర్తి మద్దతు ఇస్తాం.. ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉంటాం: దేవెగౌడ
- పుల్వామా ఉగ్రదాడిని జీర్ణించుకోలేకపోతున్నా
- మోదీ తీసుకునే ఏ నిర్ణయాన్నైనా స్వాగతిస్తాం
- ఉగ్రవాదులను ఎక్కడికక్కడ అణచివేయాల్సిందే
ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించాల్సిన అవసరం ఉందని అన్నారు. ముష్కరుల నుంచి ముప్పుపొంచి ఉంటుందని, వారిని ఎక్కడికక్కడ అణచివేయాల్సిందేనని చెప్పారు. మండ్య జిల్లాకు చెందిన ఓ జవాను ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయారని, ఆయన పార్థివదేహం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కుమారస్వామి వెళ్లి, ఆయన కుటుంబాన్ని పరామర్శిస్తారని తెలిపారు.