ప్రతీకార దాడికి భారత్ రెడీ.. నేడు అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్న కేంద్రం!
- ఈరోజు ఉదయం 11.30 గంటలకు భేటీ
- హాజరు కానున్న కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం
- భవిష్యత్ కార్యాచరణను వివరించనున్న కేంద్రం
పాకిస్తాన్ కు గట్టిగా బుద్ధి చెప్పేందుకు వీలుగా అభిప్రాయ సేకరణకు హోంశాఖ సిద్ధమైంది. కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన ఈరోజు ఉదయం 11.30 గంటలకు జరిగే ఈ సమావేశంలో ఏం చర్యలు తీసుకోవాలన్న విషయమై రాజకీయ పక్షాల నుంచి సలహాలు, సూచనలను కేంద్రం స్వీకరించనుంది. ఇప్పటిదాకా తీసుకున్న చర్యలను హోంమంత్రి రాజ్ నాథ్ ఈ సందర్భంగా నేతలకు వివరించనున్నారు. తమ భవిష్యత్ కార్యాచరణపై స్పష్టత ఇవ్వనున్నారు. మరోవైపు భారత్ పాక్ సరిహద్దులో ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కోవడానికి 150 యుద్ధ విమానాలను వాయుసేన సిద్ధంగా ఉంచింది.