YSRCP: వైసీపీలో కీలక పదవి పొందిన సినీ హాస్యనటుడు పృథ్వీరాజ్

  • వైసీపీ ఏపీ కార్యదర్శిగా పృథ్వీరాజ్ నియామకం
  • ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన
  • వైసీపీ నిర్వహించిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న పృథ్వీరాజ్
ప్రముఖ హాస్యనటుడు, వైసీపీకి చెందిన పృథ్వీరాజ్ కు ఆ పార్టీలో కీలక పదవి లభించింది. వైసీపీ ఏపీ రాష్ట్ర కార్యదర్శిగా పృథ్వీరాజ్ ని నియమించారు. ఈ మేరకు హైదరాబాద్ లోని వైసీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా, ఏపీలో వైసీపీ నిర్వహించిన కార్యక్రమాల్లో పృథ్వీరాజ్ చురుగ్గా పాల్గొన్నారు. ఇటీవల జగన్ పాదయాత్రలో కూడా పాల్గొన్నారు. ప్రజా సమస్యలను ప్రస్తావించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజెప్పేందుకు కృషి చేస్తానని, త్వరలో వీధి నాటకాలు ప్రదర్శిస్తానని పృథ్వీరాజ్ ప్రకటించారు.
YSRCP
commedian
Prudhvi Raj
jagan

More Telugu News